మనదేశం పుణ్యభూమి.. కర్మనే ధర్మంగా ఆచరిస్తూ హిందువులు జీవిస్తారు. అధాత్మికత నెలవు. అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి

భగవంతుడే స్వయంగా వెలసిన ఆలయాలు కొన్ని, దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి,  మహర్షులు, భక్తునితో నిర్మించబడినవి ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి

అయితే వీటిల్లో నేటికీ సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీతో హిస్టరీగా మారిన ఆలయం ఒకటి ఇడాన మాతాలయం

రాజస్థాన్ లో ఉదయపూర్‌లోని 60 కిలోమీటర్ల దూరంలో గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో ఇడాన మాతగా అమ్మవారు పూజలను అందుకుంటున్నారు

ఈ దేవాలయంలో విచిత్రం ఏమిటంటే.. ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారట. మంట దానంతట అదే ఉద్భవించి.. అమ్మవారికి స్నానం చేయిస్తుందట

ఈ విచిత్రమైన అమ్మవారి ఆలయం.. ఆరావళి పర్వతాల్లో  ఉంది. ఆలయం పై కప్పు ఉండదు.. చతురాస్రాకరంలో ఉంది

నెలకు రెండు మూడు సార్లు దాదాపు 10 నుంచి 20 అడుగులు  మేర అగ్ని దాని అంతట అదే ఉద్భవించి అమ్మవారు నీరు మాదిరిగా స్నానం చేస్తారట

ఇలా స్నానం చేసే సమయంలో.. అమ్మవారి విగ్రహం తప్ప.. ఆలయంలో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి

అయితే ఈ అగ్ని ఎక్కడ నుంచి ఎలా ఉద్భవిస్తుందనే విషయంపై ఇప్పటికే రకరకాల పరిశోధనలు చేశారు..  అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు

మంటల్లోని ఇడాన అమ్మవారిని దర్శించుకునేందుకు.. భారీ సంఖ్యలో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటారు