పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న అల్లు అర్జున్ తాజాగా థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టరు.
ఏషియన్ థియేటర్స్‌తో కలిసి అల్లు అర్జున్ హైదరాబాద్ ఓ మల్టిపెక్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ట్రిపుల్ ఏ సినిమాస్ అనే పేరుతో ఈ థియేటర్ ను గురువారం ఉదయం ప్రారంభించారు బన్నీ.
అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ను మరమత్తులు చేసి అదిరిపోయే మల్టీప్లెక్స్ గా మార్చారు.
ఈ ప్రారంభోత్సవం అమీర్ పేట్ లో సందడిగా జరిగింది.
అల్లుఅర్జున్ కోసం అభిమానులు భారీగా తరలి వచ్చారు.
దీంతో అమీర్ పేట్ లో పండగ వాతావరణం నెలకుంది.
ఈ ప్రారంభోత్సవనికి బన్నీతో పాటు అల్లు అరవింద్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిడితెరలు వచ్చారు.
ట్రిపుల్ ఏ సినిమాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రారంభం కానుంది.
రేపు జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఆదిపురుష్ సినిమాతో అల్లు అర్జున్ థియేటర్ ప్రారంభం కానుంది.