తెలుగు తెరపై అందం, అభినయంతో సంప్రదాయమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు లయ

ఏడేళ్లలోనే 30కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు . అయితే పెళ్లి  నటనకి దూరంగా ఉంటున్నారు లయ

కాగా తాజా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ లయ పాల్గున్నారు

"హీరోయిన్ గా నా తొలి చిత్రం 'స్వయంవరం'. అప్పటికి త్రివిక్రమ్ ఇంకా డైరెక్టర్ కాలేదు .. సునీల్ ఆర్టిస్ట్ కాలేదు" అని తెలిపారు లయ

"కె.విశ్వనాథ్ గారు, కోడి రామకృష్ణగారు, సీనియర్ వంశీ గారు, ఈవీవీ గారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు వంటి దర్శకులతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం

ఎస్వీ కృష్ణారెడ్డిగారితో చేసిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడం నా దురదృష్టం. కాకపోతే వాళ్లతో కలిసి పనిచేయడమే ఒక అందమైన జ్ఞాపకం" అని అన్నారు ఆమె

'ప్రేమించు' సినిమాలో అంధురాలి పాత్రను చేస్తే కెరియర్ దెబ్బతింటుందని సన్నిహితులు చెప్పారు

అయినా అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయని భావించి చేశాను. మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా వచ్చింది

ఇక నా కెరియర్లో ఫలానా సినిమా చేసి ఉండకపోతే బావుండుననే సినిమా ఏదైనా ఉందంటే, అది 'మా బాలాజీ' సినిమానే

ఎలాంటి సినిమాలను, పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడంతో ఆ పొరపాటు జరిగింది" అని తెలిపారు లయ