ఒక దేశంలో అందుకున్న విజయాలను ఇంకో దేశంలోకి తీసుకెళ్లను

ఎక్కడికక్కడే మొదటిసారి పరిచయం అవుతున్నట్లుగానే కష్టడతాను అంటోంది హీరోయిన్ ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక

తాజాగా ఆమె కీలక పాత్రలో కనిపించనున్న వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది

ఆమె రుస్సో బ్రదర్స్‌ రూపొందించిన ఈ సిరీస్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది

ఇందులో భాగంగానే  ‘నేను హాలీవుడ్‌కి ఎందుకు వెళ్లాలి?.. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను’ అని ఓ సందర్భంలో షారుక్‌ అన్న మాటలను ఆమె ముందు ఉంచింది  మీడియా

దీనిపై స్పందించిన ప్రియాంక  ‘‘నాకు ‘సౌకర్యం అంటే బోరింగ్‌’. ఆ పదమే నచ్చదు

నా తండ్రి మిలటరీలో పనిచేశారు. ఆయన్నుంచి క్రమశిక్షణ, విలువలు, కష్టపడే తత్వం నేర్చుకున్నాను’ అని తెలిపింది