‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్
ప్రస్తుతం నాగశౌర్య సరసన ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి చిత్రంలో నటిస్తుంది ఈ భామ
ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మూవీకి సంబంధించి పలు ఆసక్తిసకర విషయాలను తెలిపారు
ముద్దు సీన్‌పై మాళవిక స్పందిస్తూ..'ముద్దు సీన్‌లో నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సీన్ కాదు. కథలో భాగమే
ఆ సీన్ కథకు చాలా అవసరమైన సన్నివేశం. అందుకే ముద్దు సీన్‌లో నటించాల్సి వచ్చింది
సాధారణ ప్రేమ కథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి
ఈ సినిమాలో నా అనుపమ పాత్ర ఎంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది.' అని తెలిపారు