నాని, కీర్తీ సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల రూపొందించిన చిత్రం ‘దసరా’

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ ‘‘దసరా’ కోసం ప్రాణం పెట్టి చేశాను.

ఈ సినిమా తర్వాత నా కెరీర్‌ ఏ స్థాయిలో ఉంటుందనేది దేవుడికి వదిలేస్తున్నా. ఫలానా ఇమేజ్‌ని కాపాడుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు.

నా మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా. డైరెక్టర్‌ శ్రీకాంత్‌కు తెలిసిన ప్రపంచమే ‘దసరా’ సినిమా.

మాకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. తెలంగాణలోని వీర్లపల్లి ప్రాంతమంతా సెలబ్రేట్‌ చేసుకునే చిత్రమిది.

దేశమంతా మా ‘దసరా’ విడుదల కోసం ఎదురు చూస్తోందని ప్రమోషన్‌ టూర్‌లో మాకు అర్థమయింది.

దేశమంతా మా ‘దసరా’ విడుదల కోసం ఎదురు చూస్తోందని ప్రమోషన్‌ టూర్‌లో మాకు అర్థమయింది.