మగాళ్లూ ఇది మీకోసమే.. చూసుకోకపోతే ఇక అంతే..
గడిచిన 45 ఏళ్లగా పురుషులలో క్రమంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోందట.
సుమారు 62.3 శాతం వీర్య కణాల సంఖ్య తగ్గిందని అధ్యయనంలో వెల్లడి
సంచలన సృష్టిస్తున్న హ్యుమన్ రిప్రోడక్షన్ అప్‌డేట్ జర్నల్ కథనం
ఈ సమస్య కారణాలపై దృష్టి పెట్టకపోతే సంతానోత్పత్తి ఇక కష్టమేనట
యూరోప్, ఆఫ్రికా, ఆసియాతో సహా 53 దేశాల్లో చేసిన పరిశోధనలతో డేటా సేకరణ
ధూమపానం, మద్యపానం, ఊబకాయం, అసాధారణ జీవనశైలి వంటివి స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు కారణాలు.
పర్యావరణ మార్పులు వల్ల హోర్మన్ల పనితీరుపై ప్రభావం పడుతుందట.
ఆరోగ్యకరమైన జీవనశైలితో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవచ్చునని నిపుణుల సలహా.
అటు కొంతమంది పురుషులను అంగస్తంభన సమస్య, లైంగిక సమస్యలు వేధిస్తుంటాయి.
వాటిని అధిగమించేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే ఔషధాలు, వయాగ్రా ట్యాబ్లెట్లు వాడుతుంటారు.
వాటి వల్ల ప్రయోజనాల కంటే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ.
ట్యాబ్లెట్ల కంటే.. సరైన పౌష్టికాహారం ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని డాక్టర్ల సలహా.