రక్షా బంధన్ రోజు ఏ దేవుళ్లను పూజిస్తారు ??

Phani CH

19 AUG 2024

'రక్షా బంధన్' ఇది మన హిందువులకు ఒక ప్రధాన పండుగ. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి తీపిని తినిపిస్తారు.

'రక్షా బంధన్' పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమను, సంతోషాలను పంచే పండుగ అని మన అందరికి తెలిసిన విషయమే.

రక్షా బంధన్ తాలీని సిద్ధం చేయడానికి, సోదరీమణులు అందులో రాఖీ, స్వీట్లు, దీపం, బియ్యం వంటి అవసరమైన వస్తువులను ఉంచుతారు.

సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయువు కోసం రాఖీ కట్టి, సోదరుడి నుదుటిపై తిలకం వేస్తారు. రక్షాబంధన్ పండుగలో దేవుడికి రాఖీ కట్టడం ద్వారా, ఆ దేవత మిమ్మల్ని సోదరుడిలా కాపాడుతుందంటారు.

ఈ రోజున చాలా మంది శివుడికి రాఖీ కడతారు. మీరు కూడా రక్షా బంధన్ రోజున శివ లింగానికి రాఖీ కట్టవచ్చు పెద్దలు చెప్తున్నారు.

రక్షా బంధన్ రోజున కొందరు శ్రీకృష్ణుడిని పూజిస్తారు, ద్రౌపదిని రక్షిస్తానని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. ఇందుకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారని నమ్మకం.

రక్షా బంధన్ సందర్భంగా ప్రజలు సంపద, ఆనందం కోసం లక్ష్మీ దేవిని పూజిస్తారు. రక్షాబంధన్ రోజున నాగదేవునికి రాఖీ కట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సర్పదోషం తొలగిపోతుంది.