రైలు ఢీకొని పిల్లి మృతి.. ట్రైన్ ఆపరేటర్‌కు రూ. 90 వేలు జరిమానా..

రైలు ఢీకొని జంతువులు చనిపోవడం చాలా చూశాం.

మన దేశ రైల్వే చట్టం ప్రకారం ఇది నేరం కాదు.

కానీ, కొన్ని దేశాల్లో రైలు ఢీకొని ఏదైనా జంతువు చనిపోతే నేరంగా పరిగణిస్తారు.

ఫ్రాన్స్‌లోని రైలు ప్రమాదానికి సంబంధించి ఆసక్తికర కేసు వెలుగులోకి వచ్చింది.

రైలు ఢీకొని పిల్లి చనిపోయిన కేసు కోర్టుకు చేరింది.

పిల్లి మృతిని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్ష మంది సంతకాలు సేకరించి వినతిపత్రాన్ని హోంమంత్రికి అందించారు.

పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. కేసు కోర్టుకు చేరింది.

ఈ కేసులో వాదనలు విన్న పారిస్ కోర్టు ట్రైన్ ఆపరేటర్‌కు రూ. 90 వేలు జరిమానా విధించింది.