భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష

29 April 2026

Rajashekher

భారతదేశంలో అనేక భాషలు మాట్లాడతారు కానీ, అత్యంత విస్తృతంగా మాట్లాడే భాష హిందీ. రెండవ అత్యంత ఎక్కువగా మాట్లాడే భాష ఏది అని తెలుసుకోండి.

ప్రపంచ వ్యాప్తంగా 7100 కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతారు. కానీ, సంస్కృతం, తమిళం అత్యంత పురాతన భాషలుగా పరిగణించబడతాయి.

భారతదేశంలో హిందీ తర్వాత అత్యంత ఎక్కువగా మాట్లాడే భాష ఏది అన్న ప్రశ్నకు సమాధానం.. బెంగాలీ.

బెంగాళీ దేశ వ్యాప్తంగా రెండవ అత్యంత విస్తృతంగా మాట్లాడే భాష. దీనిని 97.2 మిలియన్ల మంది మాట్లాడతారు. బెంగాలీ  బంగ్లాదేశ్ జాతీయ భాష కూడా.

బెంగాలీ భాష దాని మధురమైన యాసకు ప్రసిద్ధి చెందింది. దీని లిపి బ్రాహ్మీ నుంచి ఉద్భవించింది. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కారణంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది.

ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల మందికిపైగా మందికిపైగా మాట్లాడే బెంగాలీ.. ప్రస్తుతం ప్రపంచంలో ఏడవ అత్యంత ఎక్కువగా మాట్లాడే భాష.

1952 నాటి బెంగాలీ భాషా ఉద్యమాన్ని గౌరవించడానికి యునెస్కో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.

దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత మరాఠీ, తెలుగు, తమిళ బాషలను ఎక్కువగా మాట్లాడతారు.