మనిషి ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలతో క్యాన్సర్ ప్రమాదం ఉందంటున్నారు కొందరు సైంటిస్టులు. మరి ఆ మాటల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
పెంపుడు కుక్కలతో క్యాన్సర్ ప్రమాదం ఉందా..? నిజమెంతో తెలుసుకుందాం..
పెంపుడు జంతువులుగా ఇంట్లో ఉండే కుక్కలతో మనిషికి ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు.
కుక్కలు పేరుకే పెట్స్.. నిజానికి వాటిని తమ పిల్లలు లాగా పెంచుకుంటారు ఓనర్స్.
ఇక ఎంత టెన్షన్‌లో ఉన్నవారికైని ఈ పెట్ డాగ్స్ ప్రశాంతతను ఇవ్వగలవు. ముఖ్యంగా ఒంటరిగా జీవించేవారికి ఇవి ఓ వరం.
ఎంతో విశ్వాసమైన జంతువులగా ఉన్న ఈ పెంపుడు జంతువులు ఎన్నో చోట్ల తమ ఓనర్స్‌ని కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే వీటితో మనిషి ప్రాణాలకు ప్రమాదకరమైన వ్యాధి ప్రబలే అవకాశం ఉందంటున్నారు కొందరు సైంటిస్టులు.
వారు చెప్తున్నదాని ప్రకారం.. కుక్కల రక్తంలో ఉండే పరెవర్ కెమికల్స్ క్యాన్సర్‌కి దారి తీస్తాయి.
కుక్కల రక్తంలో ఉండే పర్ అండ్ పాలీఫ్లోరోఅల్కిల్ అనే ఫరెవర్ కెమికల్స్.. కెమికల్స్, ప్లాస్టిక్స్ వంటివే.
అందుకే డాగ్స్‌తో ఆడుకునే సమయంలో ఈ కెమికల్స్ మన శరీరంలోకి చేరి లివర్, కిడ్నీ ఫంక్షన్స్‌ను దెబ్బతీస్తాయని వారు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. పెంపుడు కుక్కలతో లేదా ఇతర జంతువులతో కలిసి జీవించడం వల్ల క్యాన్సర్ వస్తుందనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదని, ఇలాంటి వాదనలు కేవలం నిరాధారమైనవేనని కొట్టి పారేస్తున్నారు.