ఈ నిజాలు మీరు అస్సలు నమ్మలేరు.. 

08 September 2023

శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగినా, తగ్గినా చెమట వాసన మారుతుంది. కుక్కలు ఈ తేడాను సులభంగా గుర్తించగలవు. 

ప్రపంచవ్యాప్తంగా సగటున పాఠశాల పనిదినాల సంఖ్య 200కాగా, జపాన్‌లో 243 అత్యధికం, స్వీడన్‌లో 170 అత్యల్పంగా ఉంటాయి. 

ఉత్తర కొరియాలో ఆంక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ పర్యటనకు వెళ్లే ప్రయాణికులు ఎయిర్‌ పోర్ట్‌లోనే మొబైల్స్‌ ఇచ్చేయాల్సి ఉంటుంది. 

న్యూజిలాండ్‌ దేశంలో జనాభా కంటే గొర్రెల సంఖ్యే ఎక్కువ. న్యూజిలాండ్‌లో మనుషులు 40 లక్షలు ఉంటే, గొర్రెలు 70 లక్షలున్నాయి. 

ఒకప్పుడు బ్రిటన్‌లో ప్రజలు మేకప్ వేసుకున్న మహిళలను మంత్రగత్తెలని నమ్మేవారు. కాలక్రమేణ ఆ అభిప్రాయం మారింది. 

చాలా రకాల లిప్‌స్టిక్స్‌ తయారీలో చేప పొలుసులను ఉపయోగిస్తారని మీకు తెలుసా.? 

ఏనుగులు తేనేటీగలకు విపరీతంగా భయపడతాయంటా. ఏనుగు తొండం లోపల, కంటి చుట్టూ కుడతాయనే భయమే దీనికి కారణం. 

అమెజాన్‌ అడవిలో చెట్లు దట్టంగా ఉంటాయంటే వర్షపు నీరు భూమిని తాకాలంటే కనీసం 5 నిమిషాలు పడుతుంది. ఇక ఈ అడవుల్లో నిత్యం వర్షం కురుస్తూనే ఉంటుంది.