ఫంగస్ నుంచి పచ్చళ్లను కాపాడుకోండిలా..
చాలా మంది వేసవి కాలంలో అనేక రకాల పచ్చళ్లను పడుతుంటారు.
ఏడాది పొడవునా ఉండేందుకు ఎక్కువ పరిమాణంలోనే చేస్తారు.
కానీ వేసవి తర్వాత వచ్చే వర్షాకాలంలో వాటికి ఫంగస్ పట్టే అవకాశం ఎక్కువ.
మరి ఫంగస్ నుంచి పచ్చళ్లను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..
పచ్చడి పెట్టాలనుకున్న టమోటా, మామిడి ముక్కలను ముందుగానే ఎండలో బాగా ఎండనివ్వాలి.
పచ్చడి చేసిన తర్వాత దాన్ని గాలి చోరబడని పాత్రలో నిల్వచేసుకోవాలి.
ఇంకా పచ్చడి ఏదైనా అందులో సరిపడినంతగా నూనె వేయాలి.
అందులో వెనిగర్ వేస్తే మరీ మంచిది.
ముఖ్యంగా తడి చేతులతో పట్టుకోవడం లేదా తేమ ప్రాంతంలో పెట్టడం చేయకండి.
ఇక్కడ క్లిక్ చేయండి...