ప్రపంచంలోనే అత్యంత పురాతన అడవి ఎక్కడుందో తెలుసా?
TV9 Telugu
29 June 2024
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.. అలాగే చాలా రహస్యమైన అడవులు కూడా చాలానే ఉన్నాయని తెలిసిందే.
తాజాగా ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని జీవశాస్త్ర, ప్రకృతి పరిశోధకులు అమెరికాలో గుర్తించారు.
న్యూయార్క్‌లోని కైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలికితీసినట్టు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వెల్లడి.
ఆ అడవిలో సేకరించిన రాళ్లపై పరిశోధనల ఆధారంగా ఈ అడవి 385 మిలియన్ సంవత్సరాల పురాతనమైనది తేల్చి చెప్పారు.
మొక్కల గుర్తులను బట్టి పురాతన అడవులను గుర్తించవచ్చు అంటున్నారు ఈ పరిశోధన జరిపిన అమెరికా శాస్త్రవేత్తలు.
వృద్ధి చెందుతున్న మొక్కలు, చెట్ల వయసును గుర్తించేందుకు సమగ్ర పరిశోధన. వాటిలో కొన్ని డైనోసార్ల కాలంలో ఉండేవంటున్నారు.
ఈ అడవి ఒకప్పుడు దాదాపు 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తర్వాత అమెజాన్ అడవులు రెండవ స్థానంలో ఉన్నాయి.
వాటిలో కొన్ని డైనోసార్ల కాలంలో ఉండేవని నమ్ముతారు. ఇది భూమిపై అతిపెద్ద జీవవైవిధ్య ప్రాంతమని చెబుతున్నారు.