సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’.

ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా సాక్షి వైద్య నటిస్తుంది.

ఈ చిత్రంలో  డినో మోరియా విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం నుంచి డినో ఫస్ట్‌లుక్‌ని విడుదల విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ఫస్ట్‌లుక్‌లో చేతిలో గన్‌ పట్టుకొని ఏజెంట్‌తో తలపడనున్నట్లు కనిపించదు డినో.

ఈ నేపథ్యంలో డినో  మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు నన్ను లవర్‌బాయ్‌ ఇమేజ్‌లో ఎక్కువ కాలం చూసినప్పుడు, ఇప్పుడు విలన్‌గా ఉండటం అంత సులభం కాదు.

కానీ, ఏజెంట్‌లో నేను యాక్షన్‌ పట్ల నాకున్న ప్రేమను చూపించాల్సి వచ్చింది.

ప్రజలు షైబానీ ఖాన్‌ను ఎంతగా ఇష్టపడతున్నారో, ఇంకా ఎక్కువగా దీనిని ఇష్టపడతారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’ అని తెలిపారు.

ఈ నెల 28న విడుదల కానున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.