వేసవిలో చెమటతో తలలో చుండ్రు సమస్య తలెత్తితే ఇలా చేయండి
కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తల స్నానం చెయ్యాలి
ఇది చుండ్రును తొలగించటమే కాక జుట్టు సహజంగా నిగనిగలాడేలా చేస్తుంది
అలాగే తాజా పెరుగును తలకు పట్టించినా కురులకు రక్షణ కవచంలా సాయపడుతుంది
15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టుకు సరిపడా తేమ అందుతుంది
వేపాకులు, నానబెట్టిన మెంతులను మెత్తగా పేస్టు చేసుకొని తలకు పట్టించాలి
లేదంటే కొన్ని వేపాకులు నీళ్లలో కాచి చల్లారిన తర్వాత వాటితో తలను కడిగినా చుండ్రు సమస్య దూరమవుతుంది