దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖనే. ప్రతి రోజు రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తుంటాయి

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రైలులో తక్కువ ఛార్జీలు ఉంటాయి

కానీ ఒకే రూట్‌లో వెళ్లే రెండు రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఉండగా, ఒక తరగతికి మాత్రమే వేరే ఛార్జీలు ఉంటాయి

రైలులో ఏ ప్రాతిపదికన ఛార్జీ నిర్ణయించబడుతుంది.. అనే విషయాలను తెలుసుకుందాం

అన్నింటిలో మొదటిది మీరు ప్రయాణించే రైలు రకాన్ని బట్టి ఛార్జీలు ఆధారపడి ఉంటాయి

ఈ రైళ్లలో సబర్బన్ రైలు, మెయిల్ రైలు, ఎక్స్‌ప్రెస్ రైలు, AC సర్వీస్ రైలు మొదలైనవి ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని రైళ్లలో ఛార్జీల విధానం భిన్నంగా ఉంటుంది

రైలు ఛార్జీలు కిలోమీటరు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారనే దాని ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు రైల్వే అధికారులు

అలాగే అందులో అనేక రకాల ఛార్జీలు ఉంటాయి. ఇది రైలు రకాన్ని బట్టి ఉంటుంది

ఈ ఛార్జీలలో కనీస దూర ఛార్జీ, కనీస సాధారణ ఛార్జీలు, రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు, GST మొదలైనవి ఉంటాయి. వీటన్నింటిని కలిపి టికెట్ రేటును నిర్ణయించారు

ఇందులో 1-5 కిలో మీటర్ల దూరం వరకు ఒక ఛార్జీ ఉంటుంది. అలాగే 6-10, 11-15, 16-20, 21-25 నుండి 4951-5000 వరకు ఇలా కిలోమీటర్లలో కూడా కేటగిరీలు ఉంటాయి