హనుమంతుడు చిరంజీవి.. సూర్యుడి వద్ద సర్వ విద్య లను నేర్చుకున్న నవ వ్యాకరణ పండితుడు

హనుమంతుడు రుద్రాంశ కలవాడు . ఆంజనేయుని పూజిస్తే అందరు దేవతలను పూజించినట్లే

హనుమంతుడి తొమ్మిది అవతారల్లోకి ఒకటి.. పంచముఖ ఆంజనేయస్వామి

క్షుద్ర భాదల నుండి కాపాడే మహామహిమాన్వితమైన శ్రీ పంచముఖ ఆంజనేయుడిని మంగళవారం ఏ విధంగా పూజించాలో చూద్దాం

తనను భక్తితో పూజించినవారు కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయస్వామికి ఐదు అంటే అమితమైన ఇష్టం

అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షణలు, ఐదు అరటిపళ్ళు సమర్పించాలని పండితులు చెబుతారు

మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు ఇస్తాడు

హనుమంతుని పూజలో అప్పాలని సమర్పిస్తే.. బుద్ధి బలం కీర్తి ధైర్యం ,  ఆరోగ్యం చురుకుదనం మాటకారితనం కలుగుతాయి

జిల్లేడు చెట్టు క్రింద హనుమంతుడిని పూజిస్తే చాలా శుభకరం. సింధూరంతో మంగళ వారం నాడు హనుమంతుడిని పూజిస్తే లాభ ప్రదం

హనుమంతుడికి నివేదించే పదార్థాలు 5 సంఖ్యలో ఉంచాలి. హనుమాన్ చాలీసా 11 మార్లు ప్రతి రోజు పారాయణ చేయడం సుందర కాండ పారాయణ తో సమానం