సిమ్‌ కార్డు నుంచి క్రెడిట్‌ కార్డు వరకు, బైక్‌ లోన్‌ నుంచి ఇంటి లోన్‌ వరకు ఏ చిన్న పనిచేయాలన్నా ఇప్పుడు ఆధార్‌ కార్డ్ తప్పనిసరిగా మారిపోయింది

దీంతో ఆధార్‌ వినియోగం అందరికీ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ఆధార్‌ కార్డ్‌కు లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది

అయితే మీ కార్డుపై ఇప్పటికే ఉన్న ఫోన్‌ నెంబర్‌ను మార్చుకోవాలనుకుంటున్నారా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ పాటించడం ద్వారా ఈ పనిని సింపుల్‌గా చేసుకోవచ్చు

ఇందుకోసం ముందుగా ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

అనంతరం మీరు మార్చాలనుకుంటున్న ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత బాక్సులో ఎంటర్‌ చేయడంతో పాటు, క్యాప్చ కోడ్‌ను కూడా టైప్‌ చేయాలి

తర్వాత ‘సెండ్‌ ఓటీపీ’ బటన్‌పై నొక్కితే.. మీ ఫోన్‌నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. సదరు ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి

ఆ తర్వాత ‘అప్‌డేటింగ్ ది మొబైల్‌ నెంబర్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకొని, సంబంధిత వివరాలను అందజేయాలి

ఆ తర్వాత ‘ఆన్‌లైన్‌ ఆధార్‌ సర్వీసెస్‌’లో మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘అప్‌డేటింగ్ ది మొబైల్‌ నెంబర్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకొని, సంబంధిత వివరాలను అందజేయాలి

వెంటనే ఓపెన్‌ అయిన కొత్త పేజీలో క్యాప్చ కోడ్‌ను కూడా ఎంటర్‌ చేస్తే.. మీ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫైచేసి ‘సేవ్‌ అండ్‌ ప్రొసీడ్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి

ఇక చివరిగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకొని మీకు సమీపంలో ఉన్న ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి రూ. 25 చెల్లించి, సంబంధిత డ్యాక్యుమెంట్లు సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది