ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది సరిగా నిద్రపోవడం లేదు. జీవనశైలి, తినే ఆహారం, పని ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు

శరీరానికి సరిపడా నిద్రలేకపోతే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య మిమ్మల్ని కూడా వేధిస్తున్నట్లయితే ఈ విధంగా చేయండి..

పడుకునే ముందు కెఫిన్‌ పదార్థాలు తీసుకోవడం మానుకోవాలి. అలాగే ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి. ఎక్కువగా ఆహారం తినకూడదు.

రాత్రి పడుకున్న తర్వాత నిద్ర రాకపోతే, ఆలోచిస్తూ ఉండకుండా మంచి సంగీతం వినండి.

వీలైనంత వరకు పగటి నిద్రకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రి నిద్ర సమయంలో గది చీకటిగా ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ రాత్రి 10:00 మరియు 11:00 PM మధ్య నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. కచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి..

బాగా నిద్రపట్టడానికి వెచ్చని నువ్వుల నూనెతో పాదాలను మసాజ్ చేసుకోవాలి. సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించాలి.