మా శరీరంలో సాధారణంగా డెసిలిటర్‌కు 3.5 mg నుండి 7.2 mg యూరిక్ యాసిడ్ ఉంటుంది
మాంసాహారులు, కాలీఫ్లవర్, పచ్చి బటానీలు, కిడ్నీ బీన్స్, ఆల్కహాల్ వంటి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్యూరిన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది
ఆహారపు అలవాట్ల ద్వారా యూరిక్ యాసిడ్ ను అదుపులో ఉంచుకోవచ్చు
ముఖ్యంగా మాంసాహారులు మోతాదుకు మించకుండా మాంసాహారాన్ని తీసుకోవాలి
40 ఏళ్ళు పైబడిన తరువాత ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలి
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వలన కీళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి
అందువల్ల ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం