రకరకాల యూపీఐ యాప్స్‌ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చాలా సులువుగా మారిపోయాయి

ఈ యాప్స్‌ను ఉపయోగించాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్ సదుపాయం ఉండాలని మనందరికీ తెలిసిందే

అయితే ఇంటర్‌నెట్‌ అవసరం లేకుండా కూడా యూపీఐ పేమెంట్స్‌ జరుపుకునే అవకాశం ఉందని మీకు తెలుసా

స్మార్ట్‌ ఫోన్‌లో ముందుగా *99# అని టైప్‌ చేయాలి

వెంటనే My Profile’, ‘Send Money’, ‘Receive Money’, ‘Pending Requests’, ‘Check Balance’, ‘UPI PIN’, ‘Transactions’ ఆప్షన్స్‌ కనిపిస్తాయి

డబ్బులు పంపాలనుకుంటే 1 నెంబర్‌ను ప్రెస్‌ Send Money ఆప్షన్‌ను ఎంచుకోవాలి

దీంతో మీ ఫోన్‌ నెంబర్‌, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది

తర్వాత ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్‌ చేయాలి. చివరిగా మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి Send పై క్లిక్ చేస్తే నేరుగా అవతలి వారి ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి

అయితే ఈ విధానంలో గరిష్టంగా రూ. 5 వేలు మాత్రమే పంపించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది