ఈరోజు దీపావళి స్పెషల్ గా ఇంట్లోనే విరిగిన పాలు లేక పన్నీరు తో గులాబీ జామ్ తయారీ గురించి తెలుసుకుందాం

కావలిసిన పదార్ధాలు: పన్నీర్ తురుము – ఒక కప్పు, మైదా – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి తగినంత, పంచదార ఒక కప్పు, నీరు ఒకకప్పు, నూనె వేయించడానికి సరిపడా, యాలకుల పొడి

పన్నీరుని ఒక ప్లేట్ లోకి తీసుకుని మైదా పిండి, కొంచెం గట్టి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి

చపాతీ పిండిలా స్మూత్ అయ్యేవరకూ కలుపుకుని ఈ పన్నీరు మిశ్రమంపై క్లాత్ కప్పి ఒక పక్కకు పెట్టుకోవాలి

మళ్ళీ స్టౌ మీద ఒక గిన్నె పెట్టి.. అందులో పంచదార వేసి.. నీరు పోసి.. కొంచెం లేత పాకం ఏర్పడే వరకూ స్టౌ మీద ఉంచి ఆ పాకంలో కొంచెం యాలకుల పొడి వేసి పక్కకు పెట్టుకోవాలి

ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని .. చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి

ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి.. వేయించడానికి సరిపడే నూనె వేసి వేడి చేసుకోవాలి

అలా నూనె వేడి ఎక్కిన తర్వాత పన్నీర్ ఉండలను వేసుకుని గోధుమ రంగు వచ్చే వరకూ వేయించుకుని కొంచెం చల్లారిన తర్వాత వాటిని రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి

కొంత సేపటి తర్వాత అవి పాకం పీల్చుకుని స్మూత్ గా చూడగానే నోరూరించేలా పన్నీర్ గులాబీ జామ్ రెడీ