మటన్ అరకిలో, టొమాటో పావుకిలో, ఉల్లిపాయలు ఒక కప్పు, బటన్‌ పుట్టగొడుగులు 200 గ్రా, కొబ్బరి పొడి 2 స్పూన్లు

రెండేసి చొప్పున లవంగాలు, ఏలకులు, బిర్యానీ ఆకులు, జీలకర్ర పొడి స్పూన్‌,  పసుపు అర స్పూన్‌

2 స్పూన్ల చొప్పున అల్లం పేస్ట్‌, వెల్లుల్లి పేస్ట్‌, ధనియాల పొడి, నూనె, కారం, ఉప్పు, సరిపడా తీసుకోవాలి

సాజీర అర స్పూన్‌, దాల్చిన చెక్క చిన్న ముక్క, గరం మసాలా పావు స్పూన్‌, మెంతిపొడి అర టీ స్పూన్‌

ఒక పాత్రలో నూనె వేసి లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, సాజీర వేసి, కొన్ని సెకన్ల తర్వాత, ఉల్లిపాయ తరుగు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి

అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి ∙దీంట్లో టమోటా ముక్కలు వేసి, గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి

తర్వాత మటన్‌ ముక్కలు వేసి, గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి

పుట్టగొడుగులు, కొబ్బరి పొడి, ఉప్పు వేసి, కప్పు నీళ్లను కలిపి, ప్రెజర్‌ కుకర్‌ మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి

ధనియాల పొడి, మసాలా వేసి, 5 నిమిషాలు ఉడికించి, కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే సరి