ఆవకాయ నిల్వ ఉండాలంటే అందులో పదార్థాల పాళ్లు ఎంత ముఖ్యమో, కొన్ని జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఎన్ని రోజులైనా ముక్క మెత్తబడదు
ఊరగాయ పెట్టే స్థలం తప్పనిసరిగా శుభ్రంగా, పొడిగా ఉండాలి
కాయ మెత్తగా ఉన్నా, పండినా పక్కన పెట్టేయాలి. లేదంటే పచ్చడి రుచి పాడవుతుంది
టెంకతో సహా ముక్కలు కోస్తే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది
ఆవకాయలో వాడే ఆవాలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, మెంతులు వంటివాటిని ముందుగా ఎండలో ఉంచి తడి లేకుండా చేసుకోవాలి
ఆవకాయలో దొడ్డుప్పు లేదా కల్లుప్పుని మాత్రమే నిల్వ పచ్చళ్లకి వాడాలి
ఆవకాయ కలిపిన తర్వాత సెరామిక్ జార్, జాడీ, గాజుపాత్రల్లో మాత్రమే నిల్వ చేయాలి. ప్లాస్టిక్‌ని అస్సలు వాడకూడదు
ఇలా చేస్తే పచ్చడి పాడవకుండా ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. రుచి కూడా కమ్మగా ఉంటుంది