బొప్పాయిలో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి

బొప్పాయి ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది

బొప్పాయితో పాటు, ఈ పానీయంలో అంజీర్, బాదం, ఫ్లాక్స్ గింజల లాంటివి కలపడం ద్వారా మరింత ప్రయోజనకరంగా మారుతుంది

బొప్పాయి ఫ్లెక్స్ సీడ్స్ స్మూతీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

బొప్పాయి ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీ చేసేందుకు కావలసినవి ఫ్లాక్స్ సీడ్ ఒకటిన్నర కప్పులు, 1 కప్పు తరిగిన బొప్పాయి, బెల్లం 2 గడ్డలు, యాలకుల పొడి 1/4 tsp, పాలు 3 కప్పులు, అంజీర్ 1, బాదం 2

ఫ్లాక్స్ సీడ్స్, బాదం, అంజీర్ పండ్లను 1 గంట నానబెట్టండి. ఇప్పుడు బొప్పాయిని కోసి పక్కన పెట్టుకోవాలి

పాలలో బెల్లం వేసి కలపాలి. ఆ తర్వాత తరిగిన బొప్పాయిని కలిపి పై మిశ్రమాలను అన్నింటిని బాగా మిక్సీ పట్టాలి

ఇలా తయారైన స్మూతీపై యాలకుల పొడి వేసి సర్వ్ చేయాలి