ఈరోజు మనం ఇంట్లో  ఈజీగా టేస్టీగా దీపావళి స్పెషల్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

కావలసిన పదార్థాలు: గింజలు లేని ఖర్జురం, జీడిపప్పు, గసగసాలు, అంజీర్,  బాదంపప్పు, సారపప్పు, ఎండుకొబ్బరి, పిస్తాపప్పు, బెల్లం, చక్కెర, నెయ్యి, యాలకుల పొడి

ఖర్జురం నిలువుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. బాదం, సారపప్పు, పిస్తా పప్పు ను పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక అంజీరా ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

అనంతరం ఒక  దళసరి గిన్నె తీసుకుని అరలీటరు నీరు వేసుకుని.. దానిలో బెల్లం. పంచదార వేసి.. ఆ గిన్నెను స్టౌ మీద పెట్టుకోవాలి

ఇప్పుడు స్టౌ ని వెలిగించి స్విమ్ లో పెట్టి.. తీగ పాకం వచ్చేలా బెల్లం పాకం తయారు చేసుకోవాలి

తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. కొంచెం నెయ్యి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఖర్జురం , బాదం, సారపప్పు, పిస్తా పప్పు, అంజీరాని వేయించుకోవాలి

అనంతరం అందులో  గసగసాలు , యాలకుల పొడి వేసి.. కొంచెం సేపు వేయించుకుని.. స్టౌ మీద నుంచి బాణలిని దింపేసుకోవాలి

తర్వాత ముందుగా రెడీ చేసుకున్న తీగ పాకంలో ఈ డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకుని కొంచెం సేపు బాగా మిక్స్ చేయాలి

అనంతరం కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని గుండ్రంగా లడ్డుల్లా చుట్టుకోవాలి

అంతే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డులు రెడీ.. దీపావళికి ఆత్మీయులకు స్వయంగా ఇంట్లో తయారు చేసిన రుచికరమైన డ్రైఫ్రూట్స్ లడ్డులను కానుకగా ఇవ్వండి