పులగం తయారీకి కావాల్సిన పదార్ధాలు కొత్త బియ్యం- కప్పు, పెసరపప్పు- అర కప్పు, నెయ్యి కరివేపాకు మిరియాలు జీలకర్ర ఉప్పు- రుచికి సరిపడా జీడిపప్పు, బాదం పప్పు

బియ్యం, పెసరపప్పును కలిపి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి

పొయ్యి మీద మందమైన అడుగున్న గిన్నె పెట్టి నెయ్యి వేసుకోవాలి

నెయ్యి వేడి ఎక్కిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి

తర్వాత ఆ పోపులో ఒక కప్పుకి మూడు కప్పుల నీరు పోసి మరిగించాలి

తర్వాత ఆ వేడి నీటిలో నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి

అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు, బాదాం ని వేసుకుని దింపేసుకోవాలి

అంతే ఎంతో రుచికరమైన పులగం రెడీ