కావల్సిన పదార్ధాలు: బంగాళదుంపలు, బ్రెడ్, బేకింగ్ సోడా, నీరు, ఉప్పు, శనగపిండి, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర, నూనె
ఈ స్నాక్ ఐటెం తయారీకి ముందుగా మూడు బంగాళదుంపలను వాటిని ఉడికించి అనంతరం తొక్కతీసుకుని ఒక గిన్నెలో వేసుకుని స్మాష్ చేసుకోవాలి
అనంతరం స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసుకుని జీలకర్ర వేసి చిటపటలాడించాలి
అనంతరం మెత్తని బంగాళాదుంపలతో పాటు కారం, మిరియాలు, ధనియాల పొడి, ఉప్పు వేసుకుని కొంచెం సేపు మగ్గించాలి
మంచి వాసన వచ్చిన తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమాన్ని స్టౌ మీద నుంచి దింపుకోవాలి
తరువాత ఒక గిన్నె తీసుకుని శనగపిండి, నీరు, చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకుని బజ్జి పిండిలా కలుపుకోవాలి
స్టౌ మీద పాన్ పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి
ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కని తీసుకుని.. ట్రై యాంగిల్ గా కట్ వాటి మధ్యలో ఆలూ మసాలా పెట్టి.. దానిని శనగ పిండిలో బజ్జిలా ముంచుకొవాలి
అంతే రుచికరమైన బ్రెడ్ ఆలూ పకోడీ రెడీ