కొబ్బరి నూనె అత్యంత ఖరీదైన నూనెలలో ఒకటి
దక్షిణాదిలో చాలా మంది కొబ్బరి నూనెను వంట నూనెగాగా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు
కొబ్బరి కాయల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో.. ఈ విశేషాలేమిటో తెలుసుకుందాం
కొబ్బరి నూనె ఎలా తయారవుతుందంటే.. కొబ్బరి పాలను తయారు చేసి, దాని ద్వారా నూనెను తయారు చేస్తారు
కొబ్బరి పాలలో నీళ్ళు కలిపి, కొద్దిపాటి ప్రక్రియ ద్వారా నూనెను తీయాలి. నూనె శాతాన్ని బట్టి కొబ్బరి క్రీమ్ లేదా కొబ్బరి పాలను తయారు చేస్తారు
కొబ్బరి పాలు సహజంగానే నీటి నుంచి విడిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. నూనె, నీటి కంటే తేలికగా ఉంటుంది
అందువల్ల నీటి ఉపరితలంపై తేలుతుంది. ఫలితంగా 12 నుంచి 24 గంటలలోపు తేలికగా తయారు చేసుకోవచ్చు
ఈ సాంప్రదాయ పద్ధతిలోనే చాలా మంది ఇంట్లోనే నూనె తయారు చేసుకుంటారు