చికెన్‌ కీమా, మొక్కజొన్న పిండి అర కప్పు చొప్పున, బియ్యప్పిండి, శనగపిండి పావు కప్పు చొప్పున తీసుకోవాలి

టీ స్పూన్‌ చొప్పున పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం అర టీ స్పూన్‌, నిమ్మరసం 2 స్పూన్లు

తరిగిన ఉల్లిపాయలు 2 కప్పులు, సరిపడా జీలకర్ర, నీళ్లు, ఉప్పు, నూనె

ఒక బౌల్‌లో చికెన్‌ కీమాతో అన్ని పదార్థులు వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.

తర్వాత నూనెలో పకోడాలు వేసుకుని, దోరగా వేయించుకోవాలి.

వేయించిన చికెన్‌ కీమా పకోడాలపై కొత్తిమీర తురుముతో అలంకరిస్తే సరి! రెడీ అయిపోయినట్టే..