మొదట.. తగు పరిమాణంలో పిండి తీసుకుని జల్లెడ పట్టాలి

తగు పాళ్లలో నూనె, ఉప్పు, వేడి నీళ్లు వేసి పిండి బాగా కలుపుకోవాలి

నీళ్లు ఒకేసారి గుమ్మరించకుండా.. కలిపే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి

పిండిలో అర చెంచా బేకింగ్‌ సోడా కలిపుకుంటే చపాతీ మెత్తగా వస్తుంది

వెడల్పుగా ఉండే పాత్ర పిండి కలిపడానికి అనుకూలంగా ఉంటుంది

కలిపిన తర్వాత తడి బట్టను పిండిపై కప్పి 20 నిముషాలపాటు పక్కన పెట్టాలి

చపాతీ చేసేటప్పుడు ఎంత తక్కువ పొడి పిండి వాడితే చపాతీ అంత మృదువుగా వస్తుంది