ఏ ఊరి దేవాలయంలోనైనా 'శ్రీరామనవమి'కి ప్రసాదంగా బెల్లం పానకం తప్పనిసరిగా పంచుతారు

అసలు బెల్లం పానకం ఎలా తయారు చేస్తారంటే..

4 కప్పుల నీళ్లలో ఒక కప్పు బెల్లాన్ని వేసి కరిగించాలి

బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి

ఈ మిశ్రమంలో స్పూన్‌ మిరియాల పొడి, అర స్పూన్‌ యాలకుల పొడి, పావు స్పూన్ అల్లం పొడి కలుపుకోవాలి

అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తియ్యతియ్యటి బెల్లం పానకం రెడీ అయినట్లే

బెల్లం పానకం తాగితే రక్తహీనతను తగ్గించి, శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ లభిస్తుంది