దీపపు ప్రమిదకు వెనుక గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు. కొన్ని ప్రాంతాల్లో గజ దీపం అని కూడా పిలుస్తారు

ఈ విధమైన దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగులో కామాక్షి అమ్మవారు వెలుగుని ఇస్తూ ఉంటారు

కామాక్షి దీపం వెలిగించేటప్పుడు అన్ని దీపాలను వెలిగించినట్లు కాకుండా కొన్ని నియమనిష్టలతో వెలిగించాలి

ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా దీపపు ప్రమిదకు అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి

వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షింతలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి

కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి

ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి

రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమిరోజు ఈ దీపాన్ని కుల దేవత యంత్రం పై ఉంచి వెలిగించడం సాంప్రదాయం

కామాక్షీ దీపం ఏ ఇంట్లో వెలుగు ప్రసరిస్తుందో.. ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో, అమ్మ కృపతో నిండి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నారు