ఉదయం నిద్ర నుంచి లేవగానే.. చాలామంది టీ తాగుతారు

అయితే మీరు తాగుతున్న టీ కల్తీనా..? కాదా? అనే విషయాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా. టీ ఆకుల (టీ పొడి) ద్వారా దీనిని తెలుసుకోవచ్చు

టీ ఆకులు స్వచ్ఛంగా, కల్తీ లేకుండా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి ఫిల్టర్ పేపర్‌ని ఉపయోగించండి

ఫిల్టర్ పేపర్ తీసుకోండి. దానిపై టీ ఆకులను వేయండి. దానిపై కొంచెం నీరు పోయాలి

ఇప్పుడు ఆ ఫిల్టర్ పేపర్‌ను నీటితో బాగా కడగాలి. అనంతరం ఆ తడి ఫిల్టర్ పేపర్‌ను లైట్ ముందు పట్టుకోండి

కాగితంపై టీ మరకలను తనిఖీ చేయండి

టీ కల్తీ అయితే కాగితంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి

ఈ విధంగా టీ పొడి మంచిదో కల్తీదో తెలుసుకోవచ్చని ఫుడ్ సేఫ్టీ నిపుణులు పేర్కొంటున్నారు