ఈ మధ్య కాలంలో కిడ్నీల్లో రాళ్ల గురించి తరచూ వింటూనే ఉన్నాం. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది. ముందుగానే గుర్తించడం ఎలా.

మన దేశంలోనే ఏటా 6 లక్షల మంది కిడ్నీల్లో రాళ్లు చేరి ఆపరేషన్లు చేయించుకుంటున్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది

పని ఒత్తిడిలో శరీరానికి అవసరమైన మేర నీరు తాగకపోవడం ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 

 నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో త్వరగా రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు

 మూత్రం చుక్కచుక్కలుగా వస్తున్నా కిడ్నీ స్టోన్స్‌గా అనుమానించాలి.

తరచూ జ్వరం, పొత్తి కడుపు నొప్పి, వికారం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

మూత్రం పోస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నా, మండుతున్నట్లు అనిపించినా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించాలి. 

మూత్రం నుంచి రక్తం కారుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

వేగంగా మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా సరే, అది కిడ్నీలో రాళ్లకు సంకేతమని భావించాలి.

 మూత్రం చిక్కగా, దుర్వాసనతో వస్తున్నా కిడ్నీలో రాళ్ల సమస్యగా అనుమానించాలి.