సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు వీటిని ఇష్టంగా తింటుంటారు.

అయితే చెట్లపై పండ్లు పండే దాక వాటిని ఉంచకపోగా..కెమికల్స్ సాయంతో పండిస్తున్నారు. మరి కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి.

సాధారణంగా మామిడి కాయ పండుగా మారాలంటే పక్వానికి రావాల్సి ఉంటుంది. అయితే ఆ సమయం వరకు చెట్టుపై ఉంచితే లాభం లేదనుకుని..కాయలను తెంపుతారు.

ఆ తరువాత కెమికల్ సాయంతో ఆ కాయలను అవసరమైన మేర పండిస్తారు.కెమికల్స్ తో పండించిన పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

మరి మార్కెట్లో దొరికే మామిడి పండ్లలో సహజమైనవి ఏవి? కెమికల్స్ తో పండించినవి ఎవనేది ఇలా గుర్తించండి.

రసాయనాలతో పండించిన మామిడి పండ్లలో అక్కడక్కడ మచ్చలు కనిపిస్తాయి. అలాగే మామిడి పండు సైజే చిన్నగా ఉంటుంది.

రసాయనాలతో పండించిన పండ్లలో ఎక్కువగా..రసమే ఉంటుంది. సహజంగా పండే మామిడి పండ్ల కంటే కృత్రిమంగా పండే పండ్లే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి.

కెమికల్స్ తో పండిన పండ్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. తెలుపు రంగు, నీలంరంగు ఉన్న పండ్లను అస్సలు కొనవద్దు. సహజంగా పండిన మామిడి పండ్లలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటుంది.