మనకు అవసరం ఉన్నవి, లేనివి అనే తేడా లేకుండా రోజూ వందల సంఖ్య మెయిల్స్‌ ఇన్‌బాక్స్‌లో హోరెత్తుతుంటాయి

వీటిలో ప్రమోషన్స్‌ మెయిల్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీటన్నింటినీ ఒక్కొక్కటిగా డిలీట్‌ చేయడం సమయంతో కూడుకున్న విషయం

అలా కాకుండా ఇలాంటి అనవసరమైన మెయిల్స్‌ వాటంతటవే ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవ్వడానికి  జీమెయిల్‌లో ఓ ఆప్షన్‌ ఉందని మీకు తెలుసా.. 

ఇందు కోసం ముందుగా జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి సెర్చ్ బార్‌లో ఫిల్టర్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి

ఆ తర్వాత ఫిల్టర్స్‌ అండ్‌ బ్లాక్‌డ్‌ అడ్రెసెస్‌ ట్యాబ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి

అనంతరం Create a new filter బటన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే ఫ్రామ్ పై సెలక్ట్‌ చేయాలి

అనంతరం అందులో మీకు ప్రాధాన్యత అనిపించవి మెయిల్‌ ఐడీలను ఎంటర్‌ చేయాలి

ఇలా చేయడం వల్ల ఇకపై ఆ మెయిల్‌ ఐడీ నుంచి వచ్చే మెయిల్స్‌ వాటంతటవే డిలీట్‌ అవుతాయి