మనం చేసుకునే వంటల్లో దాదాపు అన్నింటిలో వెల్లుల్లి వేసుకుంటాం. వెల్లుల్లితో వంటలకు మరింత రుచి వస్తుంది.
అలాంటి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వెల్లుల్లి ప్రభావవంతంగా పని చేస్తుంది.
అంతేకాకుండా వీటిలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, అలిసిన్, అజోయిన్, ఎస్-ఇథైల్‌సిస్టీన్, డైల్‌సల్ఫైడ్ వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి.
వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి.
అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును కూడా నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగితే తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమతుంది.
అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వెల్లుల్లిని నిమ్మరసంలో కలిపి తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.