గుడ్డు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
కోడి గుడ్డును ఆమ్లేట్ రూపంలో కాకుండా ఉడకబెట్టి తీసుకోవడం వల్లే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
కోడి గుడ్డు ఉడకబెట్టే సమయంలో కొన్ని సందర్భాల్లో గుడ్లు నీటిలో పగిలిపోతుంటాయి
కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా గుడ్డును పగలబెట్టకుండా ఉడకబెట్టుకోవచ్చు
చిన్న పాత్రల్లో ఉడకబెడితే ఒక గుడ్డుకు మరొకటి ఢీకొని పగిలిపోతాయి
అందుకే తక్కువ సంఖ్యలో అయినా సరే పెద్ద పాత్రలోనే ఉడకబెట్టాలి
గుడ్లును ఉడకబెట్టే ముందు నీటిలో కొంత ఉప్పు వేస్తే పగలకుండా ఉంటాయి
ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన గుడ్లను తీసిన 15 నిమిషాల తర్వాతే ఉడకబెట్టాలి