ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అది అంత సులువేమీ కాదు..

ధనవంతులు కావాలి అనుకునేవారిలో ఉండే ముఖ్యమైన అలవాటు ఏంటో తెలుసా...? వారు ఉదయాన్నే లేస్తారట. వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు.

డబ్బు సంపాదించాలి అంటే.. కేవలం ఒక్కదాని పై ఫోకస్‌ పెట్టడం వల్ల సాధ్యం కాదు. ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే..

ఒకే సమయంలో రెండు, మూడు డబ్బు ఆర్డించే పనులపై ఫోకస్‌ పెట్టాలి.

ఒక ఉద్యోగం చేస్తున్నా.. రెండు, మూడు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే.. ఎక్కువ సంపాదించవచ్చు.

మనం డబ్బు సంపాదించాలి అంటే.. మనతో ఉన్న స్నేహితులపై కూడా ఆధారపడి ఉంటుందట. లక్ష్యాన్ని ఎక్కువగా ఫోకస్‌ చేసేవారి తో ఎక్కువగా స్నేహం చేయాలట.

దాని వల్ల మనకు కూడా మన లక్ష్యం ఎప్పుడూ గుర్తుంటుంది. మన లక్ష్యం, కలలు కూడా పెద్దగా ఉండాలి. తక్కువగా ఉండటం వల్ల ఉపయోగం ఉండదు.

మీ మైండ్‌ ని మనం సెట్‌ చేసుకునేదానిపై ఆధారపడి ఉంటుంది.