జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, ఎదుగులకు ఉపయోగపడే వాటిలో నూనె ఒకటి
జుట్టు తీరును బట్టి నూనెను రాస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
మన శరీరానికి మాదిరిగానే జుట్టుకు నూనె చాలా అవసరం
జట్టుకు నూనెను రాయడం వలన వెంట్రుక అంతర్గతంగా బలంగా చేస్తుంది
సాధారణంగా డ్రై హెయిర్, గట్టి మాడు, ఉంగరాల జుట్టు ఉన్న వారికి హెయిర్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది
ఆయిల్ పెట్టుకొని మర్దన చేసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా బాగా ఉంటుంది, అంతేకాకుండా డెడ్ స్కిన్‌ను రిపేర్ చేస్తుంది
నూనెను మాములుగా వాడటం కంటే కాస్త గోరు వెచ్చగా చేసి రాసినట్లైతే ఇంకా మంచి ఫలితం ఉంటుంది
నూనెను పట్టించి కాసేపు దానికి ఆవిరి పట్టుకొని, ఆ తరువాత షాంప్ చేస్తే కూడా జుట్టుకు మంచి ఎదుగుదల ఉంటుంది