వివిధ కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. దాంవత్య జీవితంలో కలహాల వల్ల కావచ్చు.,

విడాకులు తీసుకోవడం, బిజీ షెడ్యూల్‌ వల్ల అయ్యుండొచ్చు... లేదంటే కొంతకాలం పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలని అనుకొని ఉండొచ్చు. 

కారణమేదైనా కావచ్చు, కానీ శృంగార జీవితానికి సుదీర్ష విరామం ఇవ్వడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుందంటూ పరిశోధకులు అభిప్రాయవడుతున్నారు.

ఎక్కువ కాలం శృంగారం చేయకపోవడం మీ గుండెకు మంచిది కాదు.

నిజమే శృంగారంకు ఎక్కువ రోజులు విరామం ఇవ్వడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల బారిన వడే మువ్వు పెరుగుతుంది.

శరీరంలోని అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి అద్భుతమైన మార్గం శృంగారం .అంతేకాదు.. 

ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ స్థాయిల మధ్య సమతుల్యతను పెంపొందించడంలోనూ శృంగారం సహాయపడుతుందని తద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని పరిశోధకుల అభిప్రాయం.

శృంగారం వల్ల చాలా ప్రయోజనాలున్నది వాస్తవమే.. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే శృంగారం ఒక్కటే మార్గమని అనుకోవద్దు.

శృంగారం కోరికలు ఒక్కో వ్యక్తికి ఒక్క విధంగా ఉంటాయి. అలాంటప్పుడు కొంతకాలం సెక్స్‌కు దూరంగా ఉండటం కూడా కొందరికి సాధారణమే కావొచ్చు.