నటవిశ్యరూపం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే తెలియని వారుండరు.

నటనలో, డైలాగ్ డెలివరీలో, డాన్స్ లో ఈయన తర్వాతే ఎవరైనా.

‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రంతో నందమూరి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు తారక్‌.

13ఏళ్లకి ‘బాల రామాయణం' చిత్రంలో బాల రాముడిగా అద్భుతంగా నటించి నంది అవార్డును కైవసం చేసుకున్నారు.

ఆ తర్వాత 2001లో ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం తారక్‌.

ఆ తర్వాత  ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ చిత్రంతో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది.

దిని తర్వాత ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సహా మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం ఒక్క చిత్రానికి రూ. 50-60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నరు తారక్‌.

అయితే అయన మొదటి రెమ్యునరేషన్‌ మూడున్నర లక్షల రూపాయలట.

అంత డబ్బు ఏం చేయాలో తెలియక ఎన్నో రోజులు లెక్క పెడుతూ కూర్చున్నాడట తారక్‌.

టుడిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనదైన శైలిలో అలరించిన తారక్‌కి జన్మదిన శుభాకాంక్షలు.