సాధారణంగా అన్ని కార్లలో AC సదుపాయం ఉంటుంది
ఎండాకాలంలో కారులో ప్రయాణిస్తున్నట్లయితే.. ఆటోమేటిక్‌గా మీకు ఏసీ ఆన్ చేసుకోవాలని అనిపిస్తుంది.
కారులోని ఏసీ... పెట్రోల్ నుంచి ఉత్పత్తయ్యే ఎనర్జీతో పనిచేస్తుంది.
మరి ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది ?
ఓ రిపోర్ట్ ప్రకారం 1 గంట పాటు AC వాడితే... 1.2 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది.
అలాగే... కారులో ఏసీని వాడటం వల్ల కారు మైలేజీ 5 నుంచి 10 శాతం తగ్గుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
ఏసీలో కంప్రెసర్ రన్ అయ్యేందుకు ఈ పెట్రోల్ అయిపోతుంది.
ఏసీకి పవర్ ఇచ్చేందుకు ఇంజిన్ ఎక్కువ కష్టపడాల్సి వస్తే.. ఫ్యూయల్ వాడకం కూడా ఎక్కువగా అయిపోతుంది