భార్యాభర్తల మధ్య బంధం అనేది ఒక పుస్తకం లాంటిది.భార్యాభర్తల మధ్య పొరపాట్లు అనేది అందులోని ఒక పేజీ లాంటిది.
ఒక పొరపాటు వస్తే సరిదిద్దుకోవాలి కానీ మొత్తం పుస్తకాన్ని అనరాదు.భార్య భర్తల బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు.
భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది.
భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం,'సహనం,ఓర్పు ఉండాలి.భర్తకి భార్య బలం కావాలి.బలహీనత కాకూడదు.
భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి.సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం.
గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం.
భార్యాభర్తల్లో ఒకరికి ఒకరు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని గౌరవించాలి. వారి ఇష్టాయిష్టాలను ఒకరికొకరు తెలియపరచుకోవాలి.
భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోవాలి. వీరి బంధంలో పక్క వారు ప్రవేశించడానికి అవకాశం ఇవ్వరాదు.మంచి స్నేహితుడు లాంటి భర్త దొరికినప్పుడు ఆ భార్య అదృష్టవంతులు.