ఆక్సిజన్ సిలెండర్లు కొంత మొత్తం ఆక్సిజన్ తో (దాని కెపాసిటీని బట్టి) ఉంటాయి. వాటిని రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది
కానీ, కాన్సన్‌ట్రేటర్లతో ఆ సమస్య ఉండదు. ఇవి గాలి నుంచి ఆక్సిజన్ ను తాయారు చేసే యంత్రాలు కాబట్టి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించగలవు
ఇవి కరెంట్ తో పనిచేస్తాయి. కనుక, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది
ఆక్సిజన్ మరీ ఎక్కువగా అవసరం లేనివారు మాత్రమే కాన్సన్‌ట్రేటర్లు ఉపయోగించాలి అని నిపుణులు చెబుతున్నారు
ఆక్సిజన్ ఎక్కువగా అవసరం అయ్యేవారు వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఆక్సిజన్ పొందాల్సి ఉంటుంది
వీటిని వాడుతున్న వారు ఎప్పటికప్పుడు ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలించుకోవాలి
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఫిలిప్స్, నిడెక్, ఆక్సిబ్లిస్, ఎయిర్‌సెప్, డెవిల్‌బిస్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి
వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవచ్చు
అలాగే, ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎంత స్వచ్చత తో ఆక్సిజన్ ను ఇవి అందిస్తాయి అనేది తెలుసుకోవాలి
92 – 95 శాతం స్వచ్చత తో ఆక్సిజన్ అందించే పరికరాలనే కొనుగోలు చేసుకోవాలి