ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు

 ప్రస్తుతం అంటే ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి గానీ, ఇప్పటికీ చాలా వరకు బైక్స్ పెట్రోల్‌తోనే నడుస్తాయి

అయితే, ఇంధన వాహనాల వినియోగంలోనూ వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు

వాటిలో ప్రధానమైనది మైలేజీ సమస్య

ఎంత పెట్రోల్ పోసినా.. తక్కువ కిలోమీటర్లు ఇవ్వడంతో వాహనదారులు నిట్టూరుస్తుంటారు

అయితే, వాహనాలు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే కొన్ని చిట్కాలున్నాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

మీ వాహనాలలోని టైర్లలో గాలిని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి

ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద బైక్ నిలిపినప్పుడు.. ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి

బైక్ నడిపేటప్పుడు అనవసరంగా బ్రేక్స్ వెయ్యడం మానుకోవాలి

40 kmph నుండి 50 kmph లో వెళ్తే మంచి మైలేజీని పొందవచ్చు