అరటికాయనే తీసుకోండి. విరేచనాలు తగ్గటానికివి బాగా తోడ్పడతాయి.

వీటిల్లో కఠినమైన పిండి పదార్థముంటుంది. చిన్నపేగులు దీన్ని త్వరగా గ్రహించుకోలేవు.

ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగానూ ఉపయోగపడుతుంది. చెడు బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది.

అరటికాయల్లో పొటాషియం వంటి ఎలెక్ట్రోలైట్లు దండిగా ఉంటాయి. విరేచనాలతో కోల్పోయిన ఎలెక్ట్రోలైట్లు భర్తీ కావటానికివి తోడ్పడతాయి.

ఇక తేనె గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. అనాదిగా ఔషధంగా వాడుతూనే వస్తున్నాం. 

ఇది వాపును తగ్గిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హానికర బ్యాక్టీరియాను చంపుతుంది.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలూ తేనెలో పుష్కలంగా ఉంటాయి.

నియాసిన్‌, విటమిన్‌ సి వంటి విటమిన్లు.. క్యాల్షియం, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవన్నీ శక్తిని పెంచేవే.

గోరువెచ్చటి నీటిలో రెండు చెంచాల తేనె కలిపి తాగితే దగ్గు తగ్గుముఖం పడుతుంది కూడా.