చరిత్ర ప్రకారం.. టీని క్రీస్తుపూర్వం మొదటిసారిగా 2737లో చైనా చక్రవర్తి షెన్‌నంగ్ కనిపెట్టారు
ఆయన తాగే వేడి గిన్నెలో టీ తేయాకు పడిందట దాని నుంచి వచ్చిన టేస్ట్ ఆయనకు నచ్చడంతో మొదట టీ పుట్టుకొచ్చింది
ఆ తరువాత టీని మనం తాగే విధంగా తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది
శతాబ్దాలుగా టీని ఔషధంగా వాడుతూ వచ్చేవారు. టీని తాగడానికే కాకుండా వివిధ రకాల మందులో విరివిగా ఉపయోగించేవారు
ఒకే మొక్క నుంచి రకరకాల టీలను తయారు చేసుకోవచ్చు
ఇక 1980లలో అమెరికాలో మొదటిగా టీ బ్యాగుల వాడకం మొదలైంది
వ్యాపారం నిమిత్తం అక్కడివారికి టీని టేస్ట్ చేయడానికి టీ పొడిని చిన్న బ్యాగుల్లో వేసి ఇచ్చారు
1904లో వర్జీనియాలో ఐస్‌టీని కనిపెట్టారు. కొన్ని ఐస్ ముక్కలపై టీని పోసి తాగేవారు
తైవాన్‌లో 1980 నుంచీ బబుల్ టీ అంటే బుడగల టీ వాడకంలో ఉంది. చిక్కటి టీని గిలక్కొట్టి ఇస్తారు
కొరియా, చైనాలో ‘క్రిసాంతెమమ్’ అనే హెర్బల్ టీని బాగా తాగుతారు. అది జ్వరం, తలనొప్పికి చెక్ పెడుతుంది